తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియామకం

Andhra Pradesh, Andhra Pradesh Government, AP government re-appoints YV Subba Reddy as chairman, AP govt reappoints Subba Reddy as TTD Board Chairman, AP Govt Reappoints YV Subba Reddy, AP Govt Reappoints YV Subba Reddy as TTD Board Chairman, Mango News, Subba Reddy, TTD Board Chairman, Y.V. Subba Reddy reappointed TTD Chairman, YV Subba Reddy as TTD Board Chairman, YV Subba Reddy reappointed TTD Board Chairman

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమించబడ్డారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీటీడీలో ఇతర సభ్యులను త్వరలో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముందుగా 2019లో టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలోని టీటీడీ పాలకమండలి పదవీకాలం జూన్ 21 తో పూర్తయింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే టీటీడీ ఛైర్మన్‌ గా నియమిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా బుధవారం ఉదయం 11.40 నిమిషాలకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ