ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7న వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఆన్‌లైన్ విధానంలో ఈ నెల 8లోగా జాబితాపై ఉద్యోగులు అభ్యంతరాలు తెలపవచ్చని ఆయన సూచించారు. అలాగే ఈ నెల 9న వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి 10న తుది సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నారు. కాగా గ్రేడ్-2 పోస్టుల పదోన్నతులు ఈ నెల 11న, ఇతర తత్సమాన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులను ఈ నెల 12, 13 తేదీల్లో విడుదల చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY