తిరుపతిలోని రుయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై విచారణకు ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈరోజు ఆమె దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ కోరామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలుడి మృతి దురదృష్టకరమని, అయితే బాలుడి మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ దొరకకపోవడంతో బాలుడి తండ్రి విధిలేని పరిస్థితుల్లో బైక్‌పై తరలించటం అమానవీయమని వ్యాఖ్యానించారు. అసలు బాలుడి తండ్రిని బెదిరించింది ఎవరు? ప్రైవేటు వ్యక్తులా? లేక ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉందా అన్న దానిపై విచారణ జరుపుతున్నామని మంత్రి రజని వెల్లడించారు.
ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవకుండా ‘మహాప్రస్థానం అంబులెన్స్‌లు’ 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు ఆస్పత్రుల్లోని అన్ని ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని తెలిపారు. అవసరమైతే ప్రీ పెయిడ్ వాహనాలను కూడా సమకూరుస్తామని, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలతో వ్యాపారం చేయడం నీచమని, అలాంటి వారిని ఉపేక్షించబోమని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో శిక్షిస్తామని స్పష్టం చేశారు మంత్రి రజని.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ