యూపీ: ప్రార్ధనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించాలని సీఎం యోగి ఆదేశాలు

UP CM Yogi Orders To Lowered Volume of Loud Speakers at Religious Places, CM Yogi Orders To Lowered Volume of Loud Speakers at Religious Places, Yogi Adityanath government has issued an order for places of worship, Uttar Pradesh Chief Minister Yogi Adityanath directed for restricting the volume of loudspeakers at religious places, Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Chief Minister Yogi Adityanath, Uttar Pradesh Chief Minister, Yogi Adityanath, UP CM Yogi Adityanath, Chief Minister Of Uttar Pradesh, Yogi Adityanath Chief Minister Of Uttar Pradesh, Lowered Volume of Loud Speakers at Religious Places, Loud Speakers at Religious Places, Loud Speakers at Religious Places News, Loud Speakers at Religious Places Latest News, Loud Speakers at Religious Places Latest Updates, Loud Speakers at Religious Places Live Updates, Mango News, Mango News Telugu,

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దం బయటికి పెద్దగా వినిపించకూడదన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు.. అధికారులు రాష్ట్రంలోని 17,000 మత స్థలాల్లో లౌడ్ స్పీకర్ల పరిమాణాన్ని తగ్గించారు. దీనిపై గత వారంలో సీఎం యోగి మాట్లాడుతూ.. అనుమతితో రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని, అయితే సంబంధిత ప్రాంగణం వెలుపల శబ్దం వినిపించకూడదని అన్నారు. ఇప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా 17,000 మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల పరిమాణాన్ని తగ్గించారు. ధార్మిక స్థలాల బాధ్యులే స్వయంగా ఈ చర్య తీసుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రకారం మరో 125 ప్రదేశాల నుండి స్పీకర్లను తొలగించారు.

అయితే రాష్ట్రంలో శాంతియుతంగా నమాజ్ నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, శాంతి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా యూపీలోని 37,344 మంది మత పెద్దలతో లౌడ్ స్పీకర్ విషయంలో చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో యూపీలోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి నుంచి లౌడ్‌స్పీకర్‌ను తొలగించారు. ఇంతకుముందు ఆలయంలో ప్రతిరోజూ ఉదయం గంటన్నర పాటు మతపరమైన పాటలు ప్లే చేయబడేవి, కానీ ఇప్పుడు దీనిని నిలిపివేశారు. సరైన అనుమతి లేకుండా రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఊరేగింపులు, కవాతులను అనుమతించరాదని వారం రోజుల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =