నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య తయారుచేస్తున్న మందుల్లో ఒకటైన ‘కె’ మందుకు ఏపీ హైకోర్టు సోమవారం నాడు అనుమతిచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల పరిశీలించి, నివేదిక ఇవ్వడంతో కరోనా బాధితులకు వెంటనే కె మందు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కళ్ళలో వేసే డ్రాప్స్ మందుకు సంబంధించిన 2 వారాల్లో పూర్తి నివేదిక అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ముందుగా ఆనందయ్య ఇస్తున్న కళ్ళలో వేసే డ్రాప్స్, కె రకం మందుకు తప్ప, మిగతా పీ, ఎల్, ఎఫ్ మందులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కళ్లలో డ్రాప్స్, కె మందుకు అనుమతి కోరుతూ ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టి, ఇరువర్గాల వాదనలు అనంతరం కె మందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. ఆనందయ్య మందు పంపిణీని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో రోజుకి 3 నుంచి 4 వేలమందికి మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక ప్రస్తుతం మందును సర్వేపల్లి ప్రజలకే అందిస్తామని, ఇతర జిల్లాల నుంచి ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని ఆనందయ్య సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ