ఏపీలో సెప్టెంబర్ 1నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం.. జీఓ జారీ చేసిన ప్రభుత్వం

AP Govt Issues GO Regarding Ban on Plastic Flexy and Banners From Nov 1st, AP Announces Ban on Plastic Flexis, AP Ban on Plastic Flexi And Banners, Ban on Plastic Flexis GO Passed By AP, Plastic Flexie Ban GO Passed By AP Govt, Ban on Plastic Flexis, Ban on Plastic Banners, Mango News, Mango News Telugu, AP Announces Ban on Plastic Banners, Ban on Plastic Flexi And Banners in AP, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan Latest News And Updates, AP Plastic Ban GO, AP Govt Ban on Flexi And Banners

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం విధించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పేరు మీద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఇక రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద చర్యలుంటాయని, అలాగే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ నిషేధం ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్ల ఉత్పత్తితో పాటు దిగుమతి చేసుకోవడం, ముద్రణ, వినియోగం, రవాణ, ప్రదర్శనలపై కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, హెల్త్‌ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు నిషేధం అమలును పర్యవేక్షిస్తారని తెలిపింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, పంచాయతీ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో నిషేధం అమలు ఉంటుందని వెల్లడించింది. కాగా నిషేధం అమలులో వీరికి రెవెన్యూ, పోలీసు, రవాణ, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు తోడ్పాటు అందిస్తారు. ఇక వీటికి బదులుగా కాటన్‌ మరియు నేత వస్త్రాలను వినియోగించుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది ప్రభుత్వం. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సీజ్ చేయబడిన ప్లాస్టిక్‌ బ్యానర్లను, ఫ్లెక్సీలను డిస్పోజ్ చేయడానికి అయ్యే ఖర్చుని కూడా నిబంధనలను ఉల్లఘించిన వారి నుంచే రాబట్టనుంది ప్రభుత్వం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 11 =