రోడ్డు రోలర్ తో 14 వేలకు పైగా మద్యం బాటిల్స్ ధ్వంసం

Andhra Pradesh, Andhra Pradesh News, AP Liquor Bottles, AP Liquor Bottles News, Liquor Bottles Worth Rs 72 Lakh Being Destroyed by Road Roller, Police crush seized liquor bottles, Police destroys liquor bottles worth Rs 72 lakh, Seized liquor bottles worth Rs 72 lakh

ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో 14,210 మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. గత రెండు నెలలుగా తెలంగాణ ప్రాంతాల నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ విధంగా పట్టుకున్న మద్యం బాటిల్స్ అన్నింటిని ఒక చోటికి చేర్చారు. ఈ నేపథ్యంలో అలా చేర్చిన సుమారు రూ.70 లక్షల విలువ చేసే 14వేలకు పైగా మద్యం బాటిళ్లను కృష్ణ జిల్లా పోలీసులు జూలై 17, శుక్రవారం నాడు మచిలీపట్టణంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.

ముందుగా పోలీసు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు ఈ మద్యం బాటిల్స్ కు సంబంధించి పంచనామా నిర్వహించారు. అక్రమ మద్యం తరలింపు అరికట్టడానికి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు కట్టడి చేస్తున్న విధానం అభినందనీయమని ఎస్‌ఈబీ డైరెక్టర్‌ సీహెచ్‌డీ రామకృష్ణ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu