194 యూనివర్సిటీల్లో పరీక్షలు పూర్తి, మరో 366 పరీక్షలకు సిద్ధం – యూజీసీ

366 Universities Ready to Conduct Exams in August-September, UGC Appointed Panel, UGC Committee, ugc fdp 2020, UGC Guidelines, UGC panel, ugc press release, UGC Revised Guidelines on Examinations, UGC Says 366 Universities Will Conduct Final Year Exams, UGC sets up panel to report on exams

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సవరించిన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని యూనివర్సిటీలను సెప్టెంబర్ చివరి కల్లా తప్పనిసరిగా డిగ్రీ, పీజీ ఇతర కోర్సుల చివరి సంవత్సరం/ సెమిస్టరు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ సూచించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై దేశంలోని 755 యూనివర్సిటీలు స్పందించినట్టు యూజీసీ పేర్కొంది. వీటిలో 120 డీమ్డ్ యూనివర్సిటీలు‌, 274 ప్రైవేటు, 40 కేంద్రీయ, 321 రాష్ట్ర విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు.

ఇప్పటికే 194 యూనివర్సిటీలలో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో విధానంలోపరీక్షలు జరిగినట్టుగా పేర్కొన్నారు. కాగా ఇప్పటికి పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు కూడా ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టుగా పేర్కొన్నాయని యూజీసీ తెలిపింది. మరోవైపు 2019-20 విద్యాసంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన 27 యూనివర్సిటీలలో కూడా మొదటి బ్యాచ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని యూజీసీ వెల్లడించింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 13 =