రంజాన్ మాసం సందర్భంగా.. విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం జగన్

CM Jagan Attends For Iftar Dinner At Vijayawada Arranged By AP Govt For The Muslims During Ramzan Month,CM Jagan Attends For Iftar Dinner,Iftar Dinner At Vijayawada Arranged By AP Govt,AP Govt For The Muslims During Ramzan Month,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Attends State Iftar Programme,CM YS Jagan Speech At Iftar Party,CM Jagan Attends Iftar Dinner In Vijayawada 2023,Andhra Pradesh CM Hosts Iftar,Jagan Takes Part In Iftar,AP Government Arranges Iftar Dinner,Jagan Participated Iftar,Iftar Dinner Vijayawada 2023,Iftar Dinner Vijayawada Latest News,Iftar Dinner Vijayawada Latest Updates,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News And Live Updates

పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రి విజయవాడలోని విద్యాధరపురంలో గల మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముస్లిం సాంప్రదాయ వస్త్రాలను ధరించిన సీఎం జ‌గ‌న్‌, వారితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. ఈ సందర్బంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించిన ఆయన, దేవుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ బాగుండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని కోరారు. అనంతరం సీఎం జ‌గ‌న్‌ ముస్లిం ప్రముఖులకు ఇఫ్తార్‌ విందును అందించి రోజా (ఉపవాసం)ను విరమింపజేశారు.

కాగా అంతకుముందు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మైనారిటీలు ఎంతో లబ్ధి పొందారని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి ఎక్కువ నిధులు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని, మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు. గత ప్రభుత్వం మైనార్టీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేత‌లు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కూడా ఇఫ్తార్‌కు హాజరై ప్రార్థనలు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల మంది ముస్లింలు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =