ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలంగాణ మీడియా హౌస్‌ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అల్లం నారాయణ వివరంగా కొమ్మినేనికి తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు మరియు ఇతర కార్యక్రమాల గురించి తెలియజేశారు. అలాగే మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్‌ను కొమ్మినేనికి అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలువాతో సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ అకాడమీ సెక్రెటరీ నాగులాపల్లి వెంకటేశ్వర రావు మరియు రెండు రాష్ట్రాల అకాడమీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవలే కొమ్మినేని శ్రీనివాసరావు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమితులవడం తెలిసిన విషయమే. వచ్చే రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE