ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి – సీఎం జగన్

Cm Jagan Held Review Meet On Medical And Health Department At Tadepalli Camp Office Today,Control Rooms At The State Level,Family Doctor Concept,Cm Jagan,Ap Family Doctor Concept,Ap Family Doctor Control Rooms,Family Doctor Control Rooms Ap,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, నూతన సీఎస్ జవహర్ రెడ్డి, శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు చేశారు.

వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ చేసిన కీలక సూచనలు..

 • ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో రోగులకు మందులతో పాటు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచించాలి.
 • ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ విజయవంతం కావడానికి అన్ని వనరులను వినియోగించుకోవాలి.
 • 104 వాహనాలను సమకూర్చుకోవడంతో పాటు ఖాళీలు ఉన్నచోట సిబ్బందిని నియమించుకోవాలి.
 • ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలులో స్త్రీ శిశుసంక్షేమశాఖను భాగస్వామిని చేయాలి.
 • చిన్న పిల్లలు, బాలింతలు, గర్భవతుల్లో ఎనీమియాతో బాధపడేవారిని గుర్తించి స్త్రీ శిశుసంక్షేమశాఖకు తెలియజేయాలి.
 • వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం వంటివాటిని అందించాలి.
 • వచ్చే ఏడాది ఉగాది పండుగ సమయానికి విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలు పూర్తి చేయాలి.
 • ఇక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో డాక్టర్లు విధిగా గ్రామాలను సందర్శించాలి.
 • దీనికి సంబంధించిన రియల్ టైం డేటాను లొకేషన్ తో సహా రికార్డు చేయాలి.
 • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని, మంచానికే పరిమితమైన వారికి అవసరమైన వైద్య సహాయం ప్రతి నెలా అందించాలి.
 • ఆరోగ్యశాఖలో క్రిందిస్థాయి సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ అందించాలి. అలాగే వాటిలో ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాలకు సంబంధించిన యాప్స్ అందుబాటులో ఉంచాలి.
 • తద్వారా ఎవరికి ఏ విధమైన చికిత్స ఎక్కడ అందిస్తారో ప్రజలకు వివరాలు అందించడానికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు వీలుంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here