ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 సర్వీసు 2023 పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు దీని ద్వారా తమ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన సమాచారం పొందవచ్చు. 2023 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మే 3 నుండి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది.
గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఏడుపేపర్ల పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి పరీక్ష తేది, సంబంధిత అంశాల వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్:
మే 3: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష)
మే 4: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష)
మే 5: జనరల్ ఎస్సే (పేపర్-1)
మే 6: భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు (పేపర్-2)
మే 7: పాలిటీ, భారత రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్ (పేపర్-3)
మే 8: భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి (పేపర్-4)
మే 9: సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం (పేపర్-5)
తెలంగాణ డీఈఈసీఈటీ-2025 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మరియు డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశానికి టీజీ డీఈఈసీఈటీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రవేశ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 24, 2025 నుండి మే 15, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.