ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల

Andhra Pradesh ECET-2022 Results Released Today, AP ECET-2022 Results Released Today, AP ECET Results 2022 declared, 2022 AP ECET Results, AP ECET Results, AP ECET Results has released, Andhra Pradesh ECET 2022 Results out, Andhra Pradesh State Council of Higher Education, Andhra Pradesh Engineering Common Entrance Test-2022 Results Released Today, 2022 AP Engineering Common Entrance Test-2022 Results Released Today, AP ECET-2022 Results News, AP ECET-2022 Results Latest News, AP ECET-2022 Results Latest Updates, AP ECET-2022 Results Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జూలై 22న ఈసెట్-2022 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈసెట్‌–2022 పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈసెట్-2022 ఫైనల్ కీని ప్రకటించాక, రికార్డు స్థాయిలో 10రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. మొత్తం 14 విభాగాల్లో 11 విభాగాలకు పరీక్ష నిర్వహించామన్నారు. సిరామిక్ టెక్నాలజీ, బీఎస్సి మాథెమాటిక్స్ నుంచి ఉన్న సీట్ల కంటే అప్లికేషన్స్ తక్కువ రావడంతో వారికీ పరీక్ష నిర్వహించలేదన్నారు, అలాగే బయోటెక్నాలజీకి ఒక్క అప్లికేషన్ కూడా రాకపోవడంతో పరీక్ష జరపలేదన్నారు.

ఈసారి ఈసెట్ పరీక్షను జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ నిర్వహించిందన్నారు. మొత్తం 28,502 మంది అబ్బాయిలు, 8,376 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరు కాగా, 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఈసెట్-2022 ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మ‌సీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్‌ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here