గ్రూప్‌-1, గెజిటెడ్ సహా పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల

Andhra Pradesh, AP Group-I Gazetted Posts, AP Group-I Posts Recruitment Exams, AP News, APPSC, APPSC Releases New Schedule for Group-I, Group-I Gazetted Posts, Group-I Gazetted Posts Recruitment Exams, Group-I Posts Recruitment Exams, New Schedule for Group-I Gazetted Posts

రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కొత్త తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో ఏపీపీఎస్సీ తాజాగా షెడ్యూళ్లను ‌సవరించింది. గ్రూప్‌1, గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్‌ పోస్టులు, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్ల నియామక పరీక్షల షెడ్యూళ్లను ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు జూన్ 22, సోమవారం నాడు విడుదల చేశారు.

గ్రూప్‌-1 పరీక్షల షెడ్యూల్:

  • తెలుగు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ నేచర్‌): నవంబర్‌ 2
  • ఇంగ్లీషు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ నేచర్‌): నవంబర్‌ 3
  • పేపర్‌1: నవంబర్‌ 5
  • పేపర్‌2: నవంబర్‌ 7
  • పేపర్‌3: నవంబర్‌ 9
  • పేపర్‌4: నవంబర్‌ 11
  • పేపర్‌ 5: నవంబర్‌ 13

డిగ్రీ కాలేజీ లెక్చరర్లు పరీక్షల షెడ్యూల్:

  • సెప్టెంబర్‌15 – సబ్జెక్టులు
  • సెప్టెంబర్‌16 – జీఎస్, ఎంఏ
  • సెప్టెంబర్‌16 – సబ్జెక్టులు

గెజిటెడ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్:

  • అసిస్టెంట్‌ బీసీ, సోషల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: సెప్టెంబర్‌21 ఉదయం (సబ్జెక్ట్స్‌), సెప్టెంబర్ 22 మధ్యాహ్నం (జీఎస్, ఎంఏ)
  • రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఏపీ మైనింగ్‌: సెప్టెంబర్‌ 22 ఉదయం (సబ్జెక్ట్స్‌), సెప్టెంబర్‌ 22 మధ్యాహ్నం (జీఎస్‌,ఎంఏ)
  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌ 23 మధ్యాహ్నం (సబ్జెక్టులు)
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (పోలీసు ట్రాన్స్‌పోర్టు): సెప్టెంబర్ ‌23 ఉదయం (జీఎస్‌,ఎంఏ), సెప్టెంబర్ ‌23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • అసిస్టెంట్‌ డైరక్టర్‌ టౌన్, ప్లానింగ్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • అసిస్టెంట్‌ కెమిస్ట్‌ గ్రౌండ్‌ వాటర్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌: సెప్టెంబర్‌ 23 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌ 23, 24 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)

నాన్‌గెజిటెడ్‌ పోస్టులు పరీక్షల షెడ్యూల్:

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్‌గ్రౌండ్‌వాటర్‌): సెప్టెంబర్‌ 25 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రాలజీ గ్రౌండ్‌వాటర్‌): సెప్టెంబర్‌ 26 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్ ‌26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (సైనిక్‌వెల్ఫేర్‌): సెప్టెంబర్‌ 26 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌ 26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: సెప్టెంబర్‌ 26 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆర్కియాలజీ మరియు మ్యూజియమ్స్ సబ్ సర్వీస్ : సెప్టెంబర్‌ 26 ఉదయం (సబ్జెక్ట్స్‌), సెప్టెంబర్ ‌27 మధ్యాహ్నం (జీఎస్‌, ఎంఏ)
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ మైన్స్ మరియు జియాలజి సబ్ సర్వీస్‌: సెప్టెంబర్‌ 27 ఉదయం(జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)
  • డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సర్వే: సెప్టెంబర్‌27 ఉదయం (జీఎస్‌, ఎంఏ), సెప్టెంబర్‌ 27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్‌)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu