డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం, హెచ్‌-1బీ వీసాలు నిలిపివేత

America President Donald Trump, Donald Trump, Donald Trump Signs Executive Order to Suspend H-1B Visas, Donald Trump Signs to Suspend H-1B Visas, Donald Trump Suspend H-1B Visas, H-1B Visas, H-1B Visas Suspension, US President Donald Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం దిశగా అడుగులేశారు. అమెరికా దేశంలోకి వలస (ఇమ్మిగ్రేషన్‌) వచ్చే వారిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ 1బీ,హెచ్‌ 2బీ, జే 1, ఎల్‌ 1 వీసాల జారీని ఈ ఏడాది డిసెంబర్ ‌31 వరకు నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై జూన్ 22, సోమవారం నాడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయం జూన్ 24, 2020 నుంచి డిసెంబర్ ‌31, 2020 వరకు అమల్లో ఉండనుంది.

అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇకముందు హెచ్‌ 1బీ వీసాల జారీలో అత్యంత నైపుణ్యం కలిగిన వారికీ, అధిక వేతనం లభించే ఉద్యోగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తాజా నిర్ణయం వలన లక్షల మంది వలస ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశమున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =