తెలంగాణలో హాట్ టాపిక్ అయిన మహ్మద్ ఇబ్రహీం

Nomination Of Auto Driver As MP Candidate, Auto Driver Nomination, Secunderabad Political News, Nomination, Auto Driver As MP Candidate, Mohammed Ibrahim, Telangana, Secunderabad, BJP, Kishan Reddy, Congress Party, Dana Nagender, Independent Candidate, Telangana, TS Political News, TS Live Updates, Mango News, Mango News Telugu
Nomination,auto driver as MP candidate,Mohammed Ibrahim, Telangana,Secunderabad, BJP, Kishan Reddy, Congress Party, Dana Nagender, Independent Candidate

తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కోసం ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు ప్రధానంగా ఉన్నాయి.

సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా దానం నాగేందర్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇదే స్థానం నుంచి ఓ ఆటో డ్రైవర్ సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం చర్చనీయాంశం అయింది.

సాధారణంగా ఎన్నికలు జరిగినపుడు సామాన్యులు నామినేషన్లు వేయడం తెలిసిందే. కూలీ చేసుకునే వాళ్లు, రైతులు, బిచ్చగాళ్లు కూడా కొన్ని ఎన్నికలలకు నామినేషన్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నామినేషన్ వేసే సమయంలో మాత్రం వెరైటీగా వచ్చి నామినేషన్లు వేస్తుంటారు.

తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ప్రతీ రోజూ బండిపై సమోసాలు అమ్ముకునే ఓ వ్యక్తి .. స్థానిక పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో సమోసా వాలా చెప్పిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అక్కడ సమోసా బండి నడుపుకునే వ్యక్తిలాగే సికింద్రాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేయడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.

మహ్మద్ ఇబ్రహీం అనే ఆటో డ్రైవర్ ..సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వారాసిగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం..రోజూ ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన ఆటో నడిపితేనే వచ్చే డబ్బులతో ఆ కుటుంబం పూట గడుస్తోంది.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి ఎలాంటి న్యాయం చేయకపోవడం వల్లే తాను నామినేషన్ వేసినట్లు మహ్మద్ చెబుతున్నారు. ఆటో డ్రైవర్ నైన తనను ఇక్కడ ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపిస్తే సామాన్యుల కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.మరి ఈ సామాన్యుడిని పార్లమెంటుకు పంపిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఏది ఏమయినా తెలుగు రాష్ట్రాలలో ఇలా ఎన్నికల్లో పోటీ చేసే సామాన్యుల సంఖ్యగా బాగా పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY