బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

BC Gurukul Schools 5Th Class Admissions A Golden Opportunity For Your Childs Future

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 6600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 లో సాధించిన మార్కుల ఆధారంగా బాలబాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతిలో చేరవచ్చు.

ఈ ప్రవేశాలకు అర్హులైన బీసీ విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ మార్చి 15, 2025 కాగా, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నుండి ప్రారంభమైంది.

అర్హతలు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2024-25 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదివి ఉండాలి లేదా చదువుతూ ఉండాలి.
వయో పరిమితి: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు: 11 సంవత్సరాలు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు: 12 సంవత్సరాలు మించకూడదు.
అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000 మించకూడదు.
దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి.
ప్రవేశ పరీక్ష విధానం:
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఓఎంఆర్‌ షీట్‌పై నిర్వహించబడుతుంది.
మొత్తం 100 ప్రశ్నలు – 100 మార్కులు.
ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుంది.
పరీక్ష సిలబస్ (4వ తరగతి స్థాయిలో):
తెలుగు: 15 మార్కులు
ఇంగ్లిష్: 25 మార్కులు
గణితం: 30 మార్కులు
పరిసరాల విజ్ఞానం: 30 మార్కులు
ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 15, 2025 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.