ఏపీలో ఎన్నికల సమయంలో చర్చించుకున్న కీలక నియోజకవర్గంలో మంగళగిరి కూడా ఒకటి. మంగళగిరి నుంచి నారా లోకేష్ రెండోసారి పోటీ చేయడంతో.. ఆ నియోజకవర్గంపై భారీ అంచనాలు పెరిగి..లోకేష్ గెలుపోటములపై చర్చ నడుస్తోంది.అయితే మంగళగిరిలో ఈసారి నారా లోకేష్‌పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో అక్కడ లోకేష్ ఓడిపోయినా కూడా ఐదేళ్లుగా అదే నియోజకవర్గంలో గట్టిగానే పని చేశారు. నిత్యం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టేవారు. అందరినీ కలుపుకొని ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. దీంతో అక్కడ లోకేష్‌పై అక్కడి వారికి సానుకూల స్పందన వచ్చింది. అందుకే ఈసారి అక్కడ ఎవరిని అడిగినా లోకేష్ గెలుస్తారని చెబుతున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గంపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా షురూ అయిపోయాయి.
2019 ఎన్నికల్లో మంత్రిగా ఉన్న నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే అక్కడ ఆ పార్టీ గెలిచింది. అటువంటి చోట గెలిచి సత్తా చాటుకోవడానికి లోకేష్ రెడీ అయినా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచి వెళతారని అంతా అనుకున్నా కూడా ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. నిత్య పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవడంతో లోకేష్ పై సానుభూతి బాగా పని చేసింది. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత, రాజధాని అంశం కూడా లోకేష్‌కు కలిసివచ్చాయి. దీంతో లోకేష్ తప్పకుండా గెలుస్తారన్న విశ్లేషణలు, అంచనాలు జోరందుకున్నాయి.
మే 13న పోలింగ్ జరగగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఫలితాలకు సుమారు మూడు వారాల గ్యాప్ రావడంతో రకరకాల ఊహాగానాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. మరోవైపు భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నా కూడా.. మంగళగిరి విషయానికి వచ్చేసరికి లోకేష్ ఓడిపోతారని బెట్టింగ్ కట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడ లోకేష్‌కే ఎక్కువ సానుకూలత ఉందని ఇప్పటికే సంకేతాలు రావడంతో లోకేష్ ఎంత మెజారిటీతో గెలుస్తారన్న బెట్టింగ్‌ల వైపు మొగ్గు చూపిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY