
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే జూన్ 4న రాబోయే ఫలితాలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. అయితే ఈ బెట్టింగ్‌లు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతినగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.ఆఫ్ లైన్ బెట్టింగ్స్‌తో పాటు ఆన్ లైన్‌నూ పందేలు కొనసాగుతున్నాయి. వందకు వంద ఇస్తామని, వందకు నూటా యాభై ఇస్తామని బెట్టింగ్ రాయుళ్లు పందేలులో బిజీ అయిపోయారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలో జరిగే గెలుపోటములపైన కూడా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి.
ఏపీలో కొత్తగా రాబోయే ప్రభుత్వం ఏది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందనే అంశాలపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోంది. 175 సీట్లలో వైసీపీ 110 సీట్లు గెలుస్తుందని కొంతమంది పందెం కట్టగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పవర్‌లోకి వస్తుందని మరికొంతమంది పందెం కడుతున్నారు.పార్లమెంట్ విషయానికొస్తే విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రిపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై ఎక్కువ మొత్తంలో బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం గురించి, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి,ముఖ్యమంత్రి జగన్ పోటీ చేస్తున్న పులివెందుల, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రఘురామకృష్ణరాజు, ఫురందేశ్వరి, సీఎం రమేశ్, విజయవాడ ఎంపీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలపై బెట్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు బెట్టింగ్స్‌లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోని వందలు, వేల కోట్ల ఆస్తి పరులున్న అభ్యర్ధులు పోటాపోటీగా ఖర్చు చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది. వీటితోపాటు ఎన్ఆర్ఐలు బరిలోకి దిగిన నియోజకవర్గాలలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో అయితే ఎకరాలకు ఎకరాల భూములు బెట్టింగ్ కింద అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. గెలిచిన సొమ్ములో కనీసం పది శాతం నుంచి 20 శాతం వరకు బుకీలు కమీషన్ తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY