ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘నాసా’ ప్రోగ్రామ్‌ విన్నర్ జాహ్నవి దంగేటి, పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ శిక్షణకు ఆర్ధిక సాయానికి వినతి

AP NASA Program Winner Jahnavi Dangeti Meets CM Jagan Requests For Financial Assistance To The Pilot Training, NASA Program Winner Jahnavi Dangeti Meets CM Jagan Requests For Financial Assistance To The Pilot Training, NASA Program Winner Jahnavi Dangeti Requests CM Jagan For Financial Assistance To The Pilot Training, Jahnavi Dangeti Requests CM Jagan For Financial Assistance To The Pilot Training, NASA Program Winner Jahnavi Dangeti Meets CM Jagan, NASA Program Winner Jahnavi Dangeti, NASA Program Winner, Jahnavi Dangeti, Pilot Training, Aspiring Pilot Astronaut Jahnavi Dangeti, Pilot Jahnavi Dangeti, Astronaut Jahnavi Dangeti, Jahnavi Dangeti News, Jahnavi Dangeti Latest News, Jahnavi Dangeti Latest Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి కలిశారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ ‘నాసా’ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి దంగేటి గుర్తింపు పొందింది. బుధవారం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద సీఎం జగన్‌ను జాహ్నవి కలిసింది. వరద బాధితులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా నిన్న గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలనేది తన ఆశయమని, అయితే దీనికి అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం అందించాలని ఆమె ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా జాహ్నవి విజ్ఞప్తిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఇక ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తో పాటు జాహ్నవి కుటుంబ సభ్యులు ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పంతొమ్మిదేళ్ల జాహ్నవి దంగేటి అలబామాలోని నాసా లాంచ్ ఆపరేషన్స్ కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. తద్వారా ఈ  అనలాగ్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా, మొదటి ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో జాహ్నవి అంతరిక్షయాన శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించడానికి యూరోపియన్ స్పేస్ నిపుణులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ఏఏటీసీలో రెండు వారాల శిక్షణా కార్యక్రమాన్ని (జూన్ 14 నుండి 25 వరకు) పూర్తి చేశారు. ఏఏటీసీ అంతరిక్ష కార్యక్రమాల ఆధారంగా ప్రోగ్రామ్ కోసం ముగ్గురు మహిళలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆరుగురిని ఎంపిక చేయగా వారిలో జాహ్నవి ఒకరు కావడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 12 =