ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ ముగిసి.. జూన్ 4న ఫలితాలు విడుదల కానుండటంతో ఇంకా ఎన్నికల హడావిడి ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే కాకుండా..కొన్ని చోట్ల 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ కోడ్ అమల్లో ఉండటంతో..ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలకు గాని కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు హాజరవ్వకూడదు. అంతేకాదు అభ్యర్థులకు సంబంధించిన ఎటువంటి ఫోటోలు, పోస్టర్లు కనిపించకూడదు.
అయితే నగిరిలో టీడీపీ నేతలు ఈసీ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా.. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ అయింది. చిత్తూరులో తాజాగా బ్యాడ్మింటన్ కోర్ట్ ను భాను ప్రకాష్ ప్రారంభించడంతో.. నిర్వాహకులు ఈయన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏకంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆర్కే రోజా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని పోలీసులు గాలి బాను ప్రకాష్‌పై కేసు నమోదు చేశారు.
రెండు రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో..భాను ప్రకాష్ చిక్కుల్లో పడినట్లు అయింది. నిజానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024 ఎన్నికలు జరిగాయి. ప్రత్యర్థులపై పోటాపోటీగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం విశ్రాంతి లేకుండా శ్రమించారు. అయితే ఇలా కష్టపడ్డ భాను ప్రకాశ్.. ఆయన వర్గీయులు చేసిన చిన్నచిన్న పొరపాటులతో నెగెటివిటీని సొంతం చేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY