వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక నిర్ణయం, విశాఖ జేఏసీకి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ అందజేత

YSRCP MLA Karanam Dharmasri Gives Resignation Letter To JAC on The Demand of Decentralization in AP, YSRCP MLA Karanam Dharmasri Resigned, YSRCP MLA Karanam Dharmasri, Resignation Letter To JAC, Demand of Decentralization in AP, Mango News, Mango News Telugu, Karanam Dharmasri Gives Resignation Letter, Karanam Dharmasri Latest News And Updates, Karanam Dharmasri Demand Decentralization in AP, YSRCP MLA Resigned To JAC, YSRCP Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan News And Live Updates

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోసారి రాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అక్కడి రైతులు మహాపాదయాత్ర చేస్తుండగా, మరోవైపు ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ మరియు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును సమర్ధిస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక నాన్ పొలిటికల్ జేఏసీ కూడా ఏర్పాటయింది. దీనికి అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ హనుమంతు లజపతిరాయ్ విశాఖ జేఏసీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా ఈ జేఏసీలో ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, మేధావులు సభ్యులుగా చేరారు.

ఈ క్రమంలో శనివారం ఏర్పాటు చేసిన జేఏసీ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 15న విశాఖలో రాజధానికి మద్దతుగా నగరంలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నేతలు మంత్రి అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వికేంద్రీకరణ డిమాండ్‌పై తమ పార్టీ గళాన్ని వినిపించారు. ఇదేక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణ మరియు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం విశాఖ జేఏసీకి స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను అందజేశారు. టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడుకు తాను సవాల్ చేస్తున్నానని.. ఆయనకు ధైర్యముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి తిరిగి టెక్కలి నుంచి పోటీ చేసి గెలవాలని అన్నారు.

మంత్రి అమర్‌నాథ్ సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు ఇక్కడి ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జేఏసీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను రాష్ట్రమంతటికీ తెలియజేస్తామని, దీనికోసం జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలోనూ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే అక్టోబర్ 15న విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ ర్యాలీలో పాల్గొంటామని, దీనికి పూర్తి మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక మరో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని కోసం దేనికైనా సిద్ధమన్న ఆయన, అవసరమైతే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =