కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ముందు నుంచి చెబుతూనే ఉంది. ఈసారి 400లకు పైగా స్థానాల్లో జెండగా ఎగురవేస్తామని చెప్పుకొచ్చింది. మరోసారి అధికారంలోకి వచ్చింది కానీ.. అనుకున్నన్ని స్థానాలను మాత్రం గెలుచుకోలేకపోయింది. కనీసం 300ల స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా 240 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఈసారి మిత్రపక్షాల అవసరం పడింది. మొత్తానికైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఎప్పుడే జరుగుతుందోనన్న భయం మాత్రం బీజేపీ హైకమాండ్‌లో ఉంది. దీంతో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలను కూడా మొదలు పెట్టింది. ఇతర పార్టీల్లో గెలుపొందిన ఎంపీలు.. స్వతంత్రంగా గెలుపొందిన ఎంపీలను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొందరు ఎంపీలతో బీజేపీ నేతలు టచ్‌లోకి కూడా వెళ్లారట.
ఇటు ఏపీలో రెండోసారి అధికారంలోకి వస్తామని.. వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ.. చివరికి వచ్చే సరికి బోర్లా పడింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే నాలుగు ఎంపీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఈక్రమంలో బీజేపీ హైకమాండ్ కన్ను వైసీపీ ఎంపీలపై పడింది. ఆ నలుగురు ఎంపీలను తమవైపు లాక్కుంటే.. పార్లమెంట్‌లో తమ బలం పెరుగుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. వెంటనే కాకపోయినప్పటికీ.. రెండు, మూడు నెలల తర్వాత అయినా వారిని తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారట. మరి వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని కాదని.. బీజేపీ గూటికి చేరుతారా? లేదా? అన్నది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY