-ఏపీలో రెండు ముఖ్య పథకాల విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి..ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే 4వేల రూపాయల పింఛన్ ను అంద చేస్తున్నారు. అలాగే దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు.మరో రెండు పథకాల కోసం తాజాగా ప్రకటన చేశారు . రైతుల కోసం అన్నదాత సుఖీభవ, విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాలను అమలు చేసే తేదీలను సీఎం చంద్రబాబు ప్రకటించారు.
గతంలో జగన్ సర్కార్ వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రైతులకు సాయం అందించేది. దీనికి కేంద్రం అందించే పీఎం కిసాన్ పధకం 6వేల రూపాయలకు మరో 7వేల500 రూపాయలు కలిపి 13వేల500 రూపాయలు ఏడాదికి అందించారు. అయితే తాము అధికారంలోకి వస్తే రైతులకు 20 వేల రూపాయల చొప్పున అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకం కోసం 9400 కోట్ల రూపాయలు కేటాయించిన కూటమి సర్కార్.. తాజాగా ఇదే విషయంపై ప్రకటన చేసింది.
అన్నదాత సుఖీభవ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. పీఎం కిసాన్ నిధి మూడు విడతలుగా 2వేల రూపాయలు చొప్పున.. మొత్తం 6వేల రూపాయలు నగదును అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అన్నదాత సుఖీభవకు సంబంధించి తొలి రెండు విడతల్లో 5 వేల రూపాయల చొప్పున… చివరి విడతలు 4వేల రూపాయలను అదనంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా రైతల వ్యవసాయం కోసం సాయం 20 వేల రూపాయలు అందనున్నాయి. అయితే తొలి విడతలో మేలో పీఎం కిసాన్ నిధులు జమ కానుండటంతో.. మరో 5 వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది.
అలాగేమ మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది కూడా మే నెలలోనే అందించనున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించారు. ఇలా రెండు కీలకమైన పథకాలకు సంబంధించి ఫుల్ క్లారిటీ రావడంతో పాటు రెండు పథకాలు మేలోనే రావడంతో ఏపీ వాసులలో హర్షం వ్యక్తమవుతోంది.