జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. పోలవరం ప్రాజెక్టుపై పలు కీలక నిర్ణయాలు

CM Jagan Takes Several Key Decisions Regarding Polavaram Project After Review on Department of Water Resources, AP CM Jagan Takes Several Key Decisions Regarding Polavaram Project After Review on Department of Water Resources, AP CM YS Jagan Takes Several Key Decisions Regarding Polavaram Project After Review on Department of Water Resources, Several Key Decisions Regarding Polavaram Project After Review on Department of Water Resources, AP CM YS Jagan Review on Department of Water Resources, Review on Department of Water Resources, Department of Water Resources Review, Department of Water Resources, Several Key Decisions Regarding Polavaram Project, Polavaram Project Key Decision, Polavaram Project, Polavaram Project News, Polavaram Project Latest News, Polavaram Project Latest Updates, Polavaram Project Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏపీ జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టిన ఆయన పోలవరం సహా ఇతర వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకి సమ్బన్ధంచి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణాలతో పాటు ప్రస్తుతం వరదల కారణంగా ఎదురవుతున్న పరిణామాలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ రావత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడిన గ్యాప్‌ల మరమ్మత్తు వేగంగా చేయాలని సూచన.
  • గ్యాప్‌–1, గ్యాప్‌–2 రెండు గ్యాప్‌లను పూడ్చే పనులను వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టగానే చేపట్టాలని ఆదేశం.
  • పోలవరం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం నుంచి రీయింబర్స్‌ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్ల వరకు ఉందని వెల్లడి.
  • ప్రాజెకు కోసం జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్‌గా రూ.6 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి విడుదలయ్యేలా కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులకు ఆదేశం.
  • పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించిన హెడ్‌ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచన.
  • అలాగే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న రాష్ట్రంలోని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి లక్ష్యాల నిర్దేశం.
  • మరో ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి నెలవారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ఆదేశం.
  • ఇంకా, కర్నూలు పశ్చిమ ప్రాంతం దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదని, ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని సూచన.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here