టెన్త్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీసింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Suspends 30 Teachers Against Malpractice in SSC Exams, AP Govt Suspends 30 Teachers Against Malpractice, 30 Teachers Suspends Against Malpractice in SSC Exams, Malpractice in SSC Exams, 30 Teachers Suspends, AP Govt Suspends 30 Teachers, SSC Exams Malpractice, Malpractice, SSC Exams, SSC Exams Malpractice News, SSC Exams Malpractice Latest News, SSC Exams Malpractice Latest Updates, SSC Exams Malpractice Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్‌ క్లాస్ పరీక్షల్లో వెలుగు చూసిన మాల్‌ ప్రాక్టీసింగ్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మాల్‌ ప్రాక్టీస్‌లో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. ఈ మాల్ ప్రాక్టీస్ ‌వ్యవహారంలో ఒక కార్పొరేట్ స్కూల్‌ పాత్ర ఉన్నట్టు పోలీసులు దృష్టికి వచ్చింది. పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్ స్కూల్‌లో మాల్‌ ప్రాక్టీస్‌ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షల తొలిరోజు నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రశ్నపత్రం సర్క్యులేట్ అయిన తర్వాత, కృష్ణా జిల్లా పసుమర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు ఈ కేంద్రంలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించారు.

ఉయ్యూరులోని కార్పొరేట్ స్కూల్‌కు వాట్సాప్ చాట్స్ ద్వారా పరీక్ష పత్రాల జవాబులు అందుతున్నట్లు గుర్తించారు. మాల్‌ ప్రాక్టీస్‌కు ప్రధాన సూత్రధారి అయిన సురేష్, కార్పొరేట్ స్కూల్‌ వైస్ ప్రిన్సిపాల్ ఇద్దరూ బాల్య స్నేహితులుగా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్ల మొబైల్ ఫోన్‌లలో ఎస్‌ఎస్‌సి మ్యాథమెటిక్స్ ప్రశ్నపత్రంతో పాటు సమాధానాలను కనుగొన్నారు. వెంటనే పోలీసులు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. 30 మంది వరకు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 44 మందిని అరెస్ట్‌ చేశారు అధికారులు. పరీక్షా మాల్‌ప్రాక్టీస్‌లో అధ్యాపకుల పాత్ర ఉందని రుజువైతే పరీక్ష చట్టం 25/97 ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =