రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ సంబంధాలుండటం ఆ ప్రాంత ప్రజలకు మేలు చేకూరుస్తుంది. ఈ సంబంధాలు ఇరు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతాయి. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలి. విభజన తర్వాత అలాగే మిగిలిన చాలా అంశాలు ఇప్పుడు కొలిక్కి రానున్నాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి చంద్రబాబు ల మీటింగ్ ను ఇరు రాష్ట్రాల్లో ని అన్ని పార్టీలు స్వాగతించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం మరో అడుగు ముందుకేసి రేవంత్ ను మరోసారి టార్గెట్ చేయడానికి తమకు మంచి అవకాశం వచ్చిందని భావిస్తోంది. గతంలో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ రగిలిస్తూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాకూటమి పెట్టి కాంగ్రెస్ టీడీపీ తో కలిసి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ముందుభాగం లోకి రావడంతో అప్పుడు కూడా కేసీఆర్ ఆ అంశాన్ని వాడుకుని సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ములాఖత్ అవ్వనున్న నేపథ్యంలో మరోసారి ఆ తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ లేవనెట్టి కాంగ్రెస్ ను విమర్శించే అవకాశముంది.
ఇక ఇప్పటికే ఈ మీటింగ్ కు ముందే రేవంత్ రెడ్డి ముందు పలు డిమాండ్లను ఉంచింది బీఆర్ఎస్ పార్టీ. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తరలించబడిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, అక్కడ ఉన్న సీలేరు జల విద్యుత్ కేంద్రాలను తిరిగి తెలంగాణకు రప్పించాలని డిమాండ్ ను ముందుంచింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నందున.. ఆ మండలాలు, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చేలా రేవంత్ రెడ్డి.. చంద్రబాబు పై ఒత్తిడి తీసుకురావాలని. ఆ 7 మండలాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాలనేది మొదటి ఎజెండాగా పెట్టుకోవాలి. ఆ తరువాతనే విభజన హామీలపై చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విధంగా తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు మరోసారి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి.
అయితే ఈ సారి చంద్రబాబును టార్గెట్ చేయడం అంటే పొత్తులో ఉన్న బీజేపీని కూడా టార్గెట్ చేసినట్లే. అంతే కాదు కేంద్రంలో కూడా బీజేపీ ఉండటంతో బీఆర్ఎస్ ఈ సారి గట్టిగా పోరాటం చేయడానికి సిద్దమవుతోంది. చంద్రబాబు నాయుడుని టార్గెట్ గా చేసుకుని ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శించే అవకాశం బీఆర్ఎస్ కు వచ్చింది. అన్నింటికి మించి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కి ఉన్న సన్నిహిత్యాన్ని కూడా బీఆర్ఎస్ దెబ్బతీసేందుకు ప్రయత్నించడం ఖాయం. ఇలా చంద్రబాబు రేవంత్ రెడ్డి ల మీటింగ్ రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయేజనాలు ఎంత మేరకు సఫలం అవుతాయే తెలియదు కానీ బీఆర్ఎస్ కి మాత్రం ఖచ్చితంగా లాభం చేకుర్చడం ఖాయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY