మే 13న జరగబోతున్న ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులంతా.. పోస్టల్ బ్యాలెట్‌ను పెద్ద సంఖ్యలో ఉపయోగించుకున్నారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 25 పార్లమెంటరీ స్థానాలలో 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు రాగా.. 175 అసెంబ్లీ స్థానాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ పోలైనట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఏపీలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఈ నెల 5 న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై 9న ముగిసింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 11,374 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అసెంబ్లీ నియోజక వర్గాలకు 11,370 ఓట్లు పోలయ్యాయి.
పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా చూసుకుంటే నెల్లూరు నియోజక వర్గంలో 22,650 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా పోల్ అవ్వగా.. అత్యల్పంగా 14,526 ఓట్లు అమలాపురం (ఎస్సీ) నియోజక వర్గంలో పోల్ అయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న ఇద్దరు ఓటర్లు మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటును వేయలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఉండగా… వీరిలో 5 లక్షల మంది వరకూ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో 6 లక్షల 30 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. రికార్డ్ స్థాయిలో వీరిలో లక్షా 5వేల మంది టీచర్లు ఉండగా.. 40 వేల మంది పోలీసులు ఉన్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌ను 2 లక్షల 38 వేల మంది మాత్రమే ఉపయోగించుకున్నారు. కానీ ఈ సంఖ్య ఇప్పుడు డబుల్ అవడం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వంపై ఉద్యోగులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడే ఇలా ఓటు వేస్తారన్న చర్చ జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని రేపుతోంది.పోస్టల్ బ్యాలెట్ వేయబోతున్న ఉద్యోగులను కూడా.. పార్టీల నేతలు ప్రలోభాలకు గురి చేయాలనుకున్నట్లు గట్టిగానే వార్తలు వినిపించాయి. కొన్ని చోట్ల నగదు ఇవ్వడానికి మరికొన్ని చోట్ల యూపీఐ ద్వారా పేమెంట్స్ అందించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY