పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు విషయంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

YCP MLA Ambati Rambabu Sensational Comments on Chandrababu Over Pegasus Spyware Issue in AP, YCP MLA Ambati Rambabu Sensational Comments on Chandrababu, MLA Ambati Rambabu Sensational Comments on Chandrababu Over Pegasus Spyware Issue, YCP MLA Ambati Rambabu , YCP MLA, Ambati Rambabu, MLA Ambati Rambabu, Ambati Rambabu Sensational Comments on Chandrababu, Ambati Rambabu Comments on Chandrababu, Pegasus Spyware Issue in AP, Pegasus Spyware Issue Latest News, Pegasus Spyware Issue Latest Updates, Pegasus Spyware Issue Live Updates, Pegasus Spyware, Sensational Comments, YSRCP, Mango News, Mango News Telugu,

ఏపీలో ‘పెగాసెస్ స్పై వేర్’ కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు జరిగిందన్న పశ్చిమ‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటలు ఇప్పుడు రాష్ట్రంలో కాక పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు విషయంలో చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు భారతదేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని పేర్కొన్నారు. పెగాసెస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని, వెంటనే దీని‌పై విచారణ చేపట్టాలని అంబటి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లు జరిగాయో, లేదో తేలాలంటే లోతైన విచారణ అవసరమని ఆయన అన్నారు.

అయితే ఈ ఆరోపణలను టీడీపీ ఖండించింది. కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రాలకు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని టీడీపీ స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈ విషయంలో సరైన ఇన్ఫర్మేషన్ చేరి ఉండదని, అందుకే ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. అయినా, డీజీపీ గౌతమ్ సవాంగ్ దీనిపై అప్పుడే వివరణ ఇచ్చారని.. కావాలనే వైసీపీ తమపై బురద జల్లుతోందని టీడీపీ విమర్శిస్తోంది. దీంతో.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ‘పెగాసెస్ స్పై వేర్’  వ్యవహారం చివరికి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − thirteen =