నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Participates NTR Centenary Celebrations in Nimmakuru, Balakrishna Participates NTR Centenary Celebrations in Nimmakuru, Hero Nandamuri Balakrishna Participates NTR Centenary Celebrations in Nimmakuru, Actor Nandamuri Balakrishna Participates NTR Centenary Celebrations in Nimmakuru, Nandamuri Balakrishna Participates NTR Centenary Celebrations, NTR Centenary Celebrations in Nimmakuru, NTR Centenary Celebrations, Hindupur MLA Balakrishna Participates NTR Centenary Celebrations in Nimmakuru, Natasimha Balakrishna Participates NTR Centenary Celebrations in Nimmakuru, Nimmakuru NTR Centenary Celebrations, NTR Centenary Celebrations News, NTR Centenary Celebrations Latest News, NTR Centenary Celebrations Latest Updates, NTR Centenary Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆయన అభిమానులు. దీనిలో భాగంగా.. ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ వారి స్వగ్రామమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొన్నారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తండ్రి ఎన్టీఆర్‌ పేరిట గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ కారణ జన్ముడని, ఆయన బిడ్డగా జన్మించటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన అడుగు పెట్టిన ప్రతి రంగంలో అంచెలంచెలుగా ఎదిగి భావి తరాలకు ఆదర్శంగా నిలిచారని, ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆయన జన్మించిన నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, గ్రామంలోని చెరువు ఒడ్డున 35 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన శకపురుషడని, అన్ని తరాలకు ఆదర్శప్రాయుడని బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here