6 లేన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

Centre Approves Expansion of Hyderabad-Vijayawada NH 65 to Six Lanes, Notification Issued For Land Acquisition

హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు పెద్ద శుభవార్త. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న 65వ జాతీయ రహదారి (NH 65) ఇప్పుడు ఆరు లైన్లుగా విస్తరించనుంది. ఈ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఈ రహదారి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రధాన రవాణా మార్గంగా ఉంది.

ప్రాజెక్టు వివరాలు:

  • పొడవు: మొత్తం 269 కిలోమీటర్లు ఉన్న రహదారిలో 229 కిలోమీటర్ల మేర నాలుగు వరసల నుంచి ఆరు లేన్లకు విస్తరించనున్నారు.
  • నోటిఫికేషన్: విస్తరణ కోసం అవసరమైన భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
  • అధికారుల నియామకం: భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

భూసేకరణ బాధ్యతలు (తెలంగాణ)

తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణ బాధ్యతలను ఆయా ప్రాంతాల ఆర్డీఓలకు (RDOs) అప్పగించారు. ప్రధానంగా భూసేకరణ చేపట్టనున్న ప్రాంతాలు..

  • యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండలంలోని 9 గ్రామాలు.
  • నల్గొండ జిల్లా: చిట్యాల (5 గ్రామాలు), నార్కట్‌పల్లి (5), కట్టంగూర్ (4), నకిరేకల్ (2), కేతేపల్లి (4) మండలాలు.
  • సూర్యాపేట జిల్లా: సూర్యాపేట (4), చివ్వెంల (6), కోదాడ (4), మునగాల (5) మండలాలు.

భూసేకరణ బాధ్యతలు (ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ బాధ్యతలను అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. భూసేకరణ జరిపే ప్రాంతాలు:

  • ఎన్టీఆర్ జిల్లా: నందిగామ (4 గ్రామాలు), కంచికచర్ల (4), జగ్గయ్యపేట (7), పెనుగంచిప్రోలు (3), ఇబ్రహీంపట్నం (12), విజయవాడ రూరల్ (1), విజయవాడ వెస్ట్ (2), విజయవాడ నార్త్ (1) మండలాలు/ప్రాంతాలు.

ఈ విస్తరణ పూర్తయితే, హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గి, ప్రయాణం సులభతరం కానుంది. ఇక భూ సేకరణ పూర్తయ్యాక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టెండర్ల ప్రక్రియను ప్రారంభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here