ఆంధప్రదేశ్ రాష్టానికి వివిధ కేటగిరిల్లో 16 జాతీయ పంచాయతీ అవార్డులు

AP Govt Wins 16 National Panchayat Awards for the Year 2021-2022 Under Various Categories, AP Govt Wins 16 National Panchayat Awards, Panchayat Awards, National Panchayat Awards, Andhra Pradesh wins 16 national panchayat awards, Panchayat Awards 2022, 2022 Panchayat Awards, 16 awards for AP panchayat raj department, AP Govt, National Panchayat Awards News, National Panchayat Awards Latest News, National Panchayat Awards Latest Updates, AP Won 16 National Panchayat Awards, National Panchayat Awards for the Year 2021-2022, Mango News, Mango News Telugu,

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాలతో పాటుగా రాష్ట్రాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డులను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులు-2022ల్లో (2019-20 సంవత్సరానికి గాను) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 16 అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌ ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ కు లభించినవి:

  • ఉత్తమ జిల్లా పరిషత్ (1) – తూర్పుగోదావరి
  • ఉత్తమ మండల పరిషత్ లు (4) – పెద్దమండ్యం, సబ్బవరం, మద్దికెర తూర్పు, రేగిడి ఆముదాలవలస
  • ఉత్తమ గ్రామ పంచాయతీలు (8) – మంగళంపేట, మినుములూరు, కలిగిరి, అనుమ సముద్రం, ఏడిద, అనంతపురం రూరల్, చేబ్రోలు, దమ్మినవారి పాలెం
  1. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారం: కొత్త మూలపేట – ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
  2. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు: మాబగం – ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
  3. చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు: యెక్కోలు – ఉమ్మడి నెల్లూరు జిల్లా
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =