కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను విడుదల చేసింది. మార్చి 10న 28 రాష్ట్ర ప్రభుత్వాలకు 14వ విడత పన్ను పంపిణీ కింద రూ.1,40,318 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణ నెలవారీ డెవల్యూషన్ రూ.70,159 కోట్లు కాగా, ఈసారి రెట్టింపుగా మొత్తం 28 రాష్ట్రాలకు గానూ రూ.1,40,318కోట్లు విడుదల చేస్తునట్టు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5,474 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.2,682 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇక అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ కు రూ.24,783 కోట్లు, ఆతర్వాత బీహార్ కు రూ.14,232 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.11,108 కోట్లు, పశ్చిమబెంగాల్ కు రూ.10,642 కోట్లు విడుదల అయ్యాయి. రాష్ట్రాలు తమ మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి మరియు ప్రభుత్వాల చర్యలను బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధుల విడుదల జరిగినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE