ఏపీ టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనే చర్చకు ఎండ్ కార్డ్ పడింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నాయుడు నియమించారు. 2020 నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. అయితే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో.. శ్రీనివాసరావుకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడు శ్రీనివాసరావును అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
విద్యావంతుడు అయిన శ్రీనివాసరావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై 95 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీకి శ్రీనివాసరావుకు కుటుంబానికి నాలుగు దేశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1954 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. 1994-99 మధ్య ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు.
ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం వారి కుటుంబం పనిచేస్తుండడంతో.. చంద్రబాబు నాయుడు.. శ్రీనివాసరావుకు పార్టీ పగ్గాలను అప్పగించారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అచ్చెన్నాయుడిపై ప్రశంసలు కురిపించారు. అచ్చెన్నాయుడు అద్భుతమైన పనితీరును కనబరిచారని, సవాళ్లను ఎదుర్కొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేశారని చంద్రబాబు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE