ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ 6” హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం రుణాలపై మరింత ఆధారపడుతోంది.
సర్కారు ఆధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు లేదా స్టాక్స్‌ను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించిన ప్రభుత్వం తాజాగా ₹5,000 కోట్లను సమీకరించడానికి మరోసారి బాండ్లను వేలానికి ఉంచుతోంది.
మొత్తం మూడు స్టాక్స్ ఉండగా అందులో ఒకటి ₹2,000 కోట్లు, మిగిలిన రెండింటి విలువ ఒక్కొక్కటి ₹1,500 కోట్లు. కాగా బాండ్ల కాలవ్యవధి వరుసగా 12, 13, 14 సంవత్సరాలు. వేలం తేదీ మంగళవారం, 31వ తేదీగా ఉండి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం జరగనుంది. వేలం సమయం కాంపిటీటివ్ బిడ్స్: ఉదయం 10:30 నుంచి 11:30, నాన్-కాంపిటీటివ్ బిడ్స్: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు
ఈ కొత్త రుణ ప్రణాళికతో ప్రభుత్వానికి తక్షణ అవసరాలకు నిధులను సమీకరించడం, ఎన్నికల హామీలను అమలు చేయడం వంటి దిశలో అడుగులు వేస్తుంది. వేలంలో వ్యక్తులు లేదా సంస్థలు పాల్గొనవచ్చు. ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఈ బాండ్లను విక్రయిస్తోంది.
ఇతర రాష్ట్రాల పరిస్థితి:
ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి ఉంచాయి. హర్యానా: ₹1,000 కోట్లు, జమ్మూ కాశ్మీర్: ₹320 కోట్లు, కర్ణాటక: ₹4,000 కోట్లు, మధ్యప్రదేశ్: ₹5,000 కోట్లు,
తెలంగాణ: ₹409 కోట్లు, మొత్తం 24,729 కోట్ల విలువైన సెక్యూరిటీ స్టాక్స్ రిజర్వ్ బ్యాంక్ ద్వారా మంగళవారం వేలానికి రానున్నాయి. ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్రాలు తమ అవసరాలను నెరవేర్చుకోవాలని చూస్తున్నాయి.