ఏపీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి?.. చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోబోతున్నారు?.. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు హోం శాఖను అప్పగిస్తారా?.. నారా లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? లేక పార్టీ బాధ్యతలను అప్పగిస్తారా?.. చంద్రబాబు రెడీ చేసుకున్న లీస్ట్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి?.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏపీలో ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 164 స్థానాల్లో జెండా ఎగురవేసింది. దీంతో ఇప్పుడంతా ఏపీలో ఎక్కడ చూసినా ఎవరెవరికి మంత్రి పదువులు దక్కుతాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మొన్నటి వరకు కూడా నారా లోకేష్ మంత్రి పదవికి దూరంగా ఉంటారని ప్రచారం జరిగింది. పార్టీ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టి.. పార్టీ బాధ్యతలను చూసుకుంటారని గుసగుసలు వినిపించాయి. లోకేష్‌కి కూడా మంత్రి పదవిపై పెద్దగా ఆసక్తి లేదని.. పార్టీ బాధ్యతలను చూసుకుంటూ.. టీడీపీని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారనే మాట వినిపించింది. కానీ ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లోకేష్ మంత్రి పదవికి సంబంధించి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారట. తన కేబినెట్‌లోకి లోకేష్‌ను తీసుకోవాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
2014లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక నారా లోకేష్.. పంచాయితీ రాజ్, ఐటీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఏపీకి కంపెనీలను తీసుకురావడం కోసం తీవ్రంగా కృషి చేశారు.. అంతేకాకుండా దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈక్రమంలో ఈసారి కూడా నారా లోకేష్‌కు ఐటీ శాఖను అప్పగించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారట. ఏపీని ఐటీ రంగంలో ముందుకు నడిపించాలంటే.. ఐటీ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలంటే నారా లోకేష్‌తోనే సాధ్యమని చంద్రబాబు భావిస్తున్నారట. నారా లోకేష్‌తో పాటు మరికొందరిని కూడా కేబినెట్‌లోకి తీసుకావాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట. త్వరలోనే వారి పేర్లు కూడా అధికారికంగా చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY