సుజనాను కాదని తపన చౌదరికి టికెట్

Eluru district, Tapana Chaudhary, Sujana Chaudhary,Tapana Charitable Trust, Joint West Godavari District, Sitaramanjaneya Chaudhary, TDP, BJP, Jana Sena,AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Eluru district, Tapana Chaudhary, Sujana Chaudhary,Tapana Charitable Trust, Joint West Godavari District, Sitaramanjaneya Chaudhary, TDP, BJP, Jana Sena

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారవడంతో.. పోటీ చేయబోయే సీట్ల స్థానాలపైన కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్లయింది. దీంతో భారతీయ జనతా పార్టీ నుంచి ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో దిగడానికి ఈ స్థానానికి బీజేపీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఉరఫ్ తపన చౌదరి రెడీ అవుతున్నారు. ఈ స్థానం తపన చౌదరికి దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న సుజనా చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు.

కానీ సుజనా చౌదరిని కాదని.. అనూహ్యంగా తపన చౌదరికి ఏలూరు సీటు ఖరారయినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా యి. కాషాయ పార్టీలో ఎంతో మంది సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు ఉన్నా కూడా వారందరినీ కాదని.. తపన చౌదరి వైపు పార్టీ మొగ్గు చూపిస్తుండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎవరీ తపన చౌదరి అన్న చర్చ రాజకీయ సర్కిల్లో రౌండ్లు కొడుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో చాలా జిల్లాల వారికి ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఉరఫ్ తపన చౌదరి పేరు చాలా సుపరిచితం.

తపన చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో 15 ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో సీతారామాంజనేయ చౌదరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిరుపేదలకు ఆర్థిక సహాయం నుంచి.. చిన్నారులకు విద్యాపరమైన సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. వీటితో పాటు ఎన్నో ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తపన చౌదరి అనే ఆత్మీయ పిలుపుతో అందరికీ దగ్గరయ్యారు. రాజకీయాల మీద ఉన్న మక్కువతో బీజేపీలో కూడా కొన్నాళ్లుగా యాక్టివ్‌గా పని చేస్తు న్నారు.

సీతారామాంజనేయ చౌదరి..ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావడంతో పాటు.. ప్రజల్లోనూ ఆయనకు పలుకబడి ఉండటంతో బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపుతోంది. మిగిలిన నేతలతో పోలిస్తే తపన చౌదరికి పెద్ద సంఖ్యలో అనుచర గణం ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చినట్లయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి తపన చౌదరిని బరిలోకి దించాలని అధిష్టానం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇదే సీటును ఆశించి.. తీవ్ర స్థాయిలో తనవంతు ప్రయత్నాలు సాగించారు. అయినా సరే బీజేపీ అధిష్టానం ఆయన్ను కాదని.. తపన చౌదరి వైపు మొగ్గు చూపిందంటే ఆయన ఆ స్థాయిలో పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండటమే కారణమని అంటున్నారు. ఏలూరు పార్లమెంట్‌ స్థానం పరిధిలోని 7 నియోజవర్గాల్లో కొన్నాళ్లు నుంచి పర్యటిస్తున్నారు. ఆయా నియోకజవర్గాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కమలం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు తపన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను సాగిస్తూ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =