వైరల్ వీడియోపై స్పందించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఏ విచారణకైనా సిద్ధమని వెల్లడి

AP Hindupur MP Gorantla Madhav Press Meet Over Alleged Viral Video Call, Hindupur MP Gorantla Madhav Press Meet Over Alleged Viral Video Call, MP Gorantla Madhav Press Meet Over Alleged Viral Video Call, Hindupur MP Press Meet Over Alleged Viral Video Call, Gorantla Madhav Press Meet Over Alleged Viral Video Call, AP Hindupur MP Vulgar Video Call, YSR Congress MP Gorantla Madhav in a vulgar video call with a lady, MP Gorantla Madhav in a vulgar video call with a lady, YSRCP MP Gorantla Madhav Viral Video, YSR Congress MP Gorantla Madhav, MP Gorantla Madhav, YSR Congress MP, Gorantla Madhav, MP Gorantla Madhav Viral Video News, MP Gorantla Madhav Viral Video Latest News, MP Gorantla Madhav Viral Video Latest Updates, MP Gorantla Madhav Viral Video Live Updates, Mango News, Mango News Telugu,

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో ఎంపీ మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో గురువారం వైరల్‌ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వీడియోపై స్పందించిన ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ వీడియో తనది కాదని, ఆ వీడియోలో తాను ఉన్నట్లుగా ఎవరో మార్ఫింగ్‌ చేశారని పేర్కొన్నారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీకి చెందిన వారే ఈ వీడియోను సృష్టించి ఉంటారని ఎంపీ మండిపడ్డారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని, ఫోరెన్సిక్‌ టెస్టుకైనా రెడీ అని ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పష్టం చేశారు.

ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్‌ విసిరిన ఎంపీ మాధవ్‌ కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ, శివకృష్ణలు మార్ఫింగ్ చేసిన నా వీడియోను పోస్ట్ చేశారని, వారిపై పోలీసులకు పిర్యాదు చేశానని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంకా ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంలో కూడా ఫిర్యాదు చేస్తానని, దీంతోపాటు ఆ వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపై కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. తాను జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ అశ్లీల వీడియోను సృష్టించారని, ఈ కుట్రలో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు కూడా ఉన్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + seven =