ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి వరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ.. తాజాగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబు నాయుడు చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995లో తొలిసారి చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999లో కూడా మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. 2014లో ఏపీ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. తాజాగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.
చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులుగా జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండీ ఫరూర్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, కొండపల్లి శ్రీనివాస్, ఎం.రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీని ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, రంజనీకాంత్ హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE