ఏపీలో ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారనే దానిపై క్లారిటీ వచ్చింది. మంగళవారం అర్థరాత్రి దాటాక మంత్రలు జాబితాను ప్రకటించారు. అన్ని జిల్లాలకు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌ను ఎంపిక చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. మొత్తం 24 మందిలో 17 మంది కొత్తవారికి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలను కూడా కేబినెట్‌లోకి తీసుకున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి మూడు.. బీజేపీకి ఒక శాఖను కేటాయించారు.
ఎనిమిది మంది బీసీ నేతలను.. నలుగురు కాపు నేతలను.. నలుగురు కమ్మ నేతలను.. ముగ్గురు రెడ్డి నేతలను.. ఇద్దరు ఎస్సీ నేతలను.. ఆర్యవైశ్య, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను ఒక్కొక్కరిని చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోకి తీసుకున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి మంత్రి పదవి దక్కిన వారిలో నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండీ ఫరూర్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, కొండపల్లి శ్రీనివాస్, ఎం.రాంప్రసాద్ రెడ్డి. వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
ఇక జనసేన పార్టీ నుంచి మంత్రి పదవి దక్కిన వారిలో.. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందిన సత్యకుమార్ యాదవ్‌కు కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో చోటు దక్కింది. మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE