ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మారింది. నిజానికి జూన్ 9న అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్త వెనక్కి వెళ్లి.. జూన్ 12న అమరావతి వేదికగా ఏపీ కొత్త సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణం కార్యక్రమానికి మరోసారి ప్రధాని హోదాలో మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో బీజేపీకి అధికారానికి కావాల్సిన పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో.. జూన్ 5న ఎన్డీయే మిత్రపక్షాలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్‌తో పాటు మొత్తం ఎన్డీఏ నేతలతో నరేంద్ర మోదీ సమావేశమై కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎన్డీయే పక్షనేతగా మోదీని ఎన్నుకోగా..ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు, నితీష్ కుమార్ లేఖలు ఇచ్చారు.
అయితే నారా చంద్రబాబు ఏపీ సీఎంగా 9న ప్రమాణం చేయాల్సి ఉండగా, అదే రోజు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారాన్ని చేయించనున్నారు. దీంతో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాతే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమి చంద్రబాబు, నితీష్ కుమార్‌లను తమ వైపు తిప్పుకుంటే కేంద్రంలో అధికారం చేపట్టడానికి ఆలోచించింది. కానీ బుధవారం ఎన్డీఏ మీటింగ్ కు వెళ్లిన చంద్రబాబు, నితీష్ కుమార్ కూటమికి పూర్తి మద్దతును ప్రకటించారు.
మరోవైపు బుధవారం ఎన్డీఏ నేతలు ఓసారి సమావేశమవగా, జూన్ 7న మరొకసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక భేటీలో.. ఎన్డీయే కూటమిలోని ఎంపీలందరూ హాజరు కాబోతున్నారు. మంత్రివర్గంపై చర్చించిన తర్వాత అదేరోజు సాయంత్రం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోదీ కోరనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY