ఏపీ మాజీ మంత్రి జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఈడీ షాక్‌.. రూ.22 కోట్లకు పైగా విలువైన ఆస్తులు అటాచ్

AP ED Attaches Rs 22.10 Cr Properties of Ex Minister JC Prabhakar Reddy,AP ED Attaches Prabhakar Reddy Properties,AP Enforcement Department,AP ED Latest News and Updates,Mango News,Mango News Telugu,Ex Minister JC Prabhakar Reddy,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. వాహనాల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్ చేసింది. కాగా బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపుతూ నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే కేసు నమోదైంది. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేసిన కొన్ని గడువు తీరిన వాహనాలను నకిలీ పత్రాలు చూపించి ఇతరులకు అమ్మారనే ఆరోపణల కింద ఆయనపై కేసు నమోదైంది. దీనిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ, విచారణలో భాగంగా గత కొన్ని నెలల క్రితమే జేసీ సోదరుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు కొన్ని కీలక పత్రాలు లభించినట్లు తెలుస్తోంది.

దీంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డికి చెందిన దివాకర్‌ రోడ్‌ లైన్స్‌, జటధా ఇండస్ట్రీస్‌ సహా ఆయన అనుచరుడు గోపాల్‌ రెడ్డికి సంబంధించిన సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో కంపెనీలకు చెందిన మొత్తం రూ.22. 10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని, అశోక్ లే ల్యాండ్ కంపనీ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసి, ఏపీ, కర్ణాటక, నాగాలాండ్ ప్రాంతాల్లో నకిలీ రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ పేర్కొంది. అలాగే ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో మొత్తం రూ.38.36 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించామని, ఇంకా దీనిలో పూర్తి విచారణ జరగాల్సి ఉందని ఈడీ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − nine =