ఆ కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్న చంద్రబాబు

ap, chandrababu naidu, tdp, ap cabinet
ap, chandrababu naidu, tdp, ap cabinet

ఏపీలో ఎన్నికలు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ప్రమాణస్వీకారాలు.. మంత్రి వర్గ విస్తరణ .. ఇలా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. బుధవారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 24 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శాఖలను కేటాయించారు. ఈక్రమంలో కీలక శాఖలను మాత్రం ఆయన వద్దే ఉంచుకున్నారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హోం శాఖను ఈసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఇస్తారని ముందు నుంచి కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ శాఖను మహిళా లీడర్ అయిన వంగలపూడి అనితకు కేటాయించారు.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. హోంశాఖను అనితకు కేటాయించినప్పటికీ.. అందులోని లా అండ్ ఆర్డ్‌ను మాత్రం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. గతంలో ఏపీ సీఎంగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కూడా హోంశాఖను మహిళలకు అప్పగించినప్పటికీ.. లా అండ్ ఆర్డర్‌ను మాత్రం వారివద్దే ఉంచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఫాలో అయ్యారు. పోలీసు యంత్రాంగాన్ని నియంత్రిచడంలో ఈ విభాగం కీలకం కావున.. చంద్రబాబు లా అండ్ ఆర్డర్‌ను తన వద్దే ఉంచుకున్నారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఏమి జరుగుతుందనే విషయంపై పూర్తి పట్టు ఉంటుందని బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

అలాగే అత్యంత కీలకమైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కూడా చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. మంత్రులు, నేతలు, అధికారులను అదుపులో ఉంచేందుకు ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎంత గానో ఉపయోగపడుతుంది.  అందుకే ఈ శాఖను చంద్రబాబు ఇతరులకు కేటాయించకుండా తన వద్దే ఉంచుకున్నారు. గతంలో 2014-2019 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు కూడా చంద్రబాబు ఈ శాఖను తన వద్దే ఉంచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ