యువగళం పాదయాత్ర: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌‌పై స్పందించిన నారా లోకేష్, కీలక వ్యాఖ్యలు

Yuvagalam Padayatra TDP National General Secretary Nara Lokesh Responds Over Vizag Global Investors Summit,Yuvagalam Padayatra,TDP National General Secretary,Nara Lokesh Responds Over Vizag Summit,Vizag Global Investors Summit,Mango News,Mango News Telugu,Lokesh terms global summit as fake,Nara Lokesh Slams on Global Investors Summit,AP Politics,AP Latest Political News,AP Latest News and Live Updates,GIS a bogus event alleges Lokesh,G20 Summit,G20 Summit 2023

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ (జీఐఎస్)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన బహిరంగ సభలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌‌ కాదని, అది ఒక ‘ఫేక్‌ లోకల్‌ సమ్మిట్‌’ అని అభివర్ణించారు. మరింత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) ఎటువంటి కాగితాలను ఉపయోగించకుండా సంతకం చేయబడ్డాయని, జీఐఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఈ సమ్మిట్‌‌ ద్వారా వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ఉపయుక్తమైన ఫలితాలను సాధించలేదని కూడా అన్నారు.

ఏడాదికి టర్నోవర్‌ రూ.120 కోట్లు ఉన్న ఏబీసీ కంపెనీ లక్షా 20 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుంది? అలాగే రూ.లక్ష కేపిటల్‌ ఉన్న ఓ కంపెనీ రూ.76వేల కోట్లు పెట్టుబడి పెడుతుందా? కేవలం 50 మంది ఉద్యోగులతో కూడిన ఐటీ కంపెనీ రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం నమ్మదగ్గదేనా? ఈ కంపెనీలు ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యమేనా? అని లోకేష్ ప్రశ్నించారు. నగరాల్లోని విలువైన భూములను లాక్కోవడం కోసమే ఈ డ్రామా ఆడుతున్నారని, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఇలా అందరినీ జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇక పీపీఏలు రద్దు చేయొద్దని కేంద్రం హెచ్చరించినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఖాతరు చేయలేదని విమర్శించారు.

ఇక సమ్మిట్ సందర్భంగా భోజనాల కోసం పలువురు గొడవకు దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై స్పందిస్తూ.. నిరుపేద దేశమైన సోమాలియాలో కూడా పెట్టుబడిదారులు ఆహారం మరియు బహుమతి వస్తువుల కోసం ఇలా కొట్టుకోరని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన లులు, కియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర రాజా తదితర సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను స్థాపించాయని గుర్తు చేశారు. అయితే ఆయా పరిశ్రమలు నేడు ఎక్కడున్నాయని ప్రశ్నించిన నారా లోకేష్.. సీఎం జగన్ వైఖరికి విసిగిపోయి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. దీంతో లక్షలాది మంది రాష్ట్ర యువత ఉపాధి కోల్పోయారని, వారందరికీ టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =