ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అఖండ విజయం సాధించి.. టీడీపీ అధికార పీఠంలో కూర్చుంది అంటే దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణే. ఎవరు ఒప్పుకోకున్నా.. ఎవరు ఒప్పుకున్నా ఈ నిజాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బాగానే అర్ధం చేసుకున్నారు. అందుకే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు అడుగడుగునా టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. అందుకే డిప్యూటీ సీఎంతో సహా కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించి ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించారు.
ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తవ్వడంతో సచివాలయంలో కార్యాలయాల ఏర్పాటుపై అధికారులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు..పవన్ కళ్యాణ్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు మిత్ర పక్షం జనసేన ఆత్మగౌరవం దెబ్బతినకుండా చంద్రబాబు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారన్న విషయాన్ని మరోసారి చెప్పకనే చెప్పారు.
దీనిలో భాగంగానే తన బ్లాక్‌లోనే పవన్ కళ్యాణ్‌కు కూడా ఓ చాంబర్‌ను కేటాయించాలని చంద్రబాబు అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్‌కు హై సెక్యూరిటీ ఉండటంతో.. మొదటి బ్లాకులోనే ఆయనకు ఓ చాంబర్‌ను కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జగన్ ప్రభుత్వం హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు 2, 3, 4, 5 బ్లాక్‌లలో చాంబర్లు ఉండేవి. మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి, సీఎస్‌లకు మాత్రమే చాంబర్‌లు ఉండేవి. కానీ,ఇప్పుడు సీఎం చాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం చాంబర్‌ను ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ గురించి మరోవార్త కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో సీఎం,డిప్యూటీ సీఎం ఫొటోలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కట్టకపోతే చంద్రబాబుకు సీఎం పదవి కలగానే ఉండిపోయేదన్నది జగమెరిగిన సత్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది తెలుసుకోవడంతోనే అనుభవశాలి అయిన చంద్రబాబు ప్రతీ విషయంలో పవన్ కు ప్రత్యేకంగా చూసుకుంటున్నారని చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ