ఏపీలో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలయిన విషయం తెలిసిందే. ఘోరాతి ఘోరంగా పరాజయం పాలయింది. 175 స్థానాలకు గానూ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అయితే ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైసీపీ ఓటమిగల కారణాలపై పలువురు స్పందిస్తూ రకరకాలుగా విశ్లేషణలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఓడిపోయిందని.. అందుకు తగి ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తోంది అంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైసీపీ ఓటమికి గల కారణాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే వైసీపీ ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మనం చేసిన తప్పులు, పాపాలు ఏదో ఒకనాడు తిరిగి మన మెడకు చుట్టుకుంటాయనే దానికి ఇదే మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.గతంలో జగన్‌పై నమ్మకంతో 151 సీట్లు ఇచ్చిన ఏపీ ప్రజలు.. ఆయన చేసిన తప్పులతో ఈసారి గద్దె దించారన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయని ఆరోపించారు. సొంత పార్టీ నేతలను కూడా ఆయన దూరం పట్టారని వెల్లడించారు. తన వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీలను జగన్ తిట్టి పంపించారని.. వారు ఇతర పార్టీల్లో చేరి గెలిచి వచ్చారని చెప్పుకొచ్చారు.
అలాగే హైదరాబాద్‌లో జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కూల్చివేతలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే కూల్చివేతలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇటువంటి చిల్లర పనులు చేయలేదని.. ముందు ముందు కూడా చేయరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తగత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు, తన రాజకీయ భవిష్యత్ తనక ముఖ్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE