వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ భేటీ, వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం

CM YS Jagan Held Meeting with YSRCP District Presidents and Regional Co-ordinators, CM YS Jagan Held Meeting with Regional Co-ordinators, CM YS Jagan Held Meeting with YSRCP District Presidents, Meeting with YSRCP District Presidents and Regional Co-ordinators, Jagan conducted a meeting with YSRCP regional coordinators and district party presidents, YSRCP party Regional Co-ordinators, YSRCP party District Presidents, Meeting of Ministers YSRCP District Presidents Regional Coordinators chaired by CM YS Jagan, CM YS Jagan Meeting, YSRCP District Presidents Meeting, YSRCP District Presidents Meeting News, YSRCP District Presidents Meeting Latest News, YSRCP District Presidents Meeting Latest Updates, YSRCP District Presidents Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఆగస్టు 4 నుంచి పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతానని నేతలకు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నేతలకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం జగన్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు.

  • ఆగష్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గంలోని 50 మంది ముఖ్య కార్యకర్తలతో భేటీకి హామీ.
  • సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించి ప్రతి నెలా అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
  • క్షేత్రస్థాయిలో ప్రతినెలా కచ్చితంగా ఆరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
  • ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం 10 రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలి.
  • ప్రతి సచివాలయం పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు కేటాయిస్తున్నాం.
  • ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు సరిగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
  • బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలి.
  • వీటితో పాటు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలి.
  • అలాగే పార్టీ బూత్‌ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలి.
  • ప్రతి కార్యకర్తా అంకితభావంతో పనిచేస్తే మన పార్టీ రాష్ట్రంలో 175కి 175 స్థానాల్లో విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 7 =