అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ.. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

CM Chandrababu and Minister Lokesh Attends AP Mock Assembly by Students in Amaravati

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలపై అవగాహన కల్పించడానికి అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు (బుధవారం) ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాక్ అసెంబ్లీ (AP Mock Assembly) కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు హాజరయ్యారు. ఈ మాక్ అసెంబ్లీలో సభా కార్యక్రమాలు పూర్తిగా విద్యార్థి ప్రతినిధులచే నిర్వహించబడ్డాయి.

మాక్ అసెంబ్లీ (మినీ టు మినిట్) కార్యక్రమం వివరాలు
సమయం (ఉదయం) కార్యక్రమం ముఖ్యాంశాలు
09:30 – 09:40 సభ ప్రారంభం, స్పీకర్ ఎంపిక ప్రొటెం స్పీకర్ ఆగమనం, స్పీకర్ ఎంపిక, స్పీకర్‌ను సీఎం, ప్రతిపక్ష నేతలుగా విద్యార్థులు ఎస్కార్ట్ చేయడం.
09:40 – 09:45 ప్రారంభ వ్యాఖ్యలు స్పీకర్, పార్టీ నాయకులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధుల ప్రారంభ వ్యాఖ్యలు, స్పీకర్‌కు అభినందనలు.
09:45 – 10:20 ప్రశ్నోత్తరాలు 35 నిమిషాల పాటు ప్రశ్నలు, సమాధానాలతో కూడిన ప్రశ్నోత్తరాల సమయం.
10:20 – 10:35 జీరో అవర్ సభలో అత్యవసర ప్రజా సమస్యలపై 15 నిమిషాల పాటు జీరో అవర్.
10:35 – 10:55 శాసనసభ బిజినెస్ సోషల్ మీడియా యూస్ బిల్, పర్యావరణ పరిరక్షణ బిల్లులు సభ ముందుకు రావడం, చర్చించడం.
10:55 – 11:00 స్పీకర్ ముగింపు వ్యాఖ్యలు సభాపతిగా ఉన్న విద్యార్థి ప్రతినిధి ముగింపు వ్యాఖ్యలు.

ముఖ్య అతిథుల ప్రసంగాలు, ప్రతిజ్ఞ

మాక్ అసెంబ్లీ అనంతరం, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది:

  • 11:00 AM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫోటోకు నివాళులు అర్పించడం.

  • 11:05 AM: చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ రాజ్యాంగం మరియు పరిపాలన విలువలపై ప్రసంగం.

  • 11:10 AM: మంత్రి నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధిపై ప్రసంగం.

  • 11:20 AM: స్పీకర్ అయ్యన్నపాత్రుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు చర్చలపై సందేశం.

  • 11:30 AM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలు, యువతకు విజన్ వంటి అంశాలపై కీలక ఉపన్యాసం.

  • 12:00 PM: చిన్నారుల కోసం రూపొందించిన రాజ్యాంగ ప్రతి పుస్తకాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయడం.

  • 12:10 PM: రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయడం.

  • 12:30 PM: అసెంబ్లీ భవనాలను విద్యార్థులకు సిబ్బంది చూపించడం.

ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులకు శాసనసభ పనితీరు, ప్రజాస్వామ్య విలువలు మరియు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యక్ష అవగాహన లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here