సీఐఐ సమ్మిట్‌కు ముందే.. ఏపీకి రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు

CM Chandrababu Announces, AP Secures Over Rs.1 Lakh Cr Investments Ahead of CII Summit

విశాఖపట్నంలో రేపు (నవంబర్ 14) మరియు ఎల్లుండి (నవంబర్ 15) జరగనున్న ప్రతిష్టాత్మక 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే విశాఖకు చేరుకుని పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

సీఐఐ సమ్మిట్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం పలు అంతర్జాతీయ సంస్థలతో కీలకమైన ఒప్పందాలను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా తైవాన్ కంపెనీలతో కుదుర్చుకున్న రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాల వివరాలను తెలిపారు.

తైవాన్ కంపెనీలతో రెండు కీలక ఒప్పందాలు
  1. కుప్పంలో పరిశ్రమ:
    • పెట్టుబడి: రూ.400 కోట్ల రూపాయలు.
    • స్థలం: కుప్పంలో 470 ఎకరాలు.
    • ఉద్యోగాలు: ప్రత్యక్షంగా 50,000 ఉద్యోగాలు లభిస్తాయి.
  2. ఓర్వకల్లు (కర్నూలు) ప్రాజెక్ట్:
    • కంపెనీలు: మిజోలి ఇండియా జేవీ, మిజోలి యూఎస్ఏ, క్రియేటివ్ సెన్సోర్ (తైవాన్), సినేస్టి టెక్నాలజీలు.
    • పెట్టుబడి: రూ.18 వేల కోట్లు.
    • ఉత్పత్తి: 23 GWH ఫ్రికర్సర్ ఫ్రి సింగిల్ క్రిస్టర్ క్యాతోడ్ యాక్టివ్ మెటీరియల్, సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్ తయారీ కేంద్రం.
    • ఉద్యోగాలు: ప్రత్యక్షంగా 2,000 ఉద్యోగాలు.

ఈ ఒప్పందాలు స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో కీలక భూమిక పోషిస్తాయని, తద్వారా వికాసిత్ భారత్ వైపు నడిపిస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

రీన్యూ పవర్ భారీ పెట్టుబడి
  • సంస్థ: రీన్యూ పవర్ (ReNew Power).
  • పెట్టుబడి: రూ.80,000 కోట్లకు పైగా.
  • రంగం: సోలార్ ఇంగాట్ & వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి.
  • ఒప్పందం: దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్న ఈ సంస్థ, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసింది.

మొత్తంగా, సీఐఐ సదస్సు ప్రారంభానికి ముందే రాష్ట్రానికి సుమారు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన కీలక ప్రకటనలు మరియు ఒప్పందాలు ఖరారయ్యాయి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నేడు కుదుర్చుకున్న ఈ ఒప్పందాలు రేపు, ఎల్లుండి జరుగబోయే సదస్సులో మరిన్ని భారీ పెట్టుబడులు రావొచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here