ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ‘ఎర్త్ అవర్’ పాటించండి, ప్రజలకు ఏపీ గవర్నర్ పిలుపు

AP Governor Biswabhusan Harichandan Appeals Citizens to Join Earth Hour Campaign Today, AP Governor Biswabhusan Harichandan, AP Governor Appeals Citizens to Join Earth Hour Campaign Today, Earth Hour Campaign, AP Governor, Biswabhusan Harichandan, Biswabhusan Harichandan Governor of Andhra Pradesh, Governor of Andhra Pradesh, Andhra Pradesh Governor, Earth Hour Campaign Latest News, Earth Hour Campaign Latest Updates, Earth Hour, Earth Hour 2022, 2022 Earth Hour, Shape Our Future, earth hour campaign In AP, AP earth hour campaign, Mango News, Mango News Telugu,

మార్చి 26, శనివారం రాత్రి 8.30- 9.30 గంటల మధ్య గంట పాటు కార్యాలయాలు మరియు నివాసాల వద్ద అన్ని అనవసరమైన లైట్లను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించగల పరిరక్షణ మరియు స్థిరమైన అభ్యాసాలను దృష్టిలో ఉంచుకోవడానికి ‘ఎర్త్ అవర్’ ప్రచారం దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు రాజ్‌భవన్‌ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా తెలిపారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో గ్లోబల్ స్థాయిలో 2007లో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం, మార్చి నెల చివరి శనివారం రాత్రి 8:30 గంటల నుంచి గంట పాటుగా 9:30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాలు మరియు భూభాగాల్లో ఎర్త్ అవర్ పాటిస్తున్నారు. ఈ సంవత్సరం ఎర్త్ అవర్ యొక్క థీమ్ ను ‘షేప్ అవర్ ఫ్యూచర్’ గా నిర్ణయించారు. ప్రస్తుతం భూప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడమనేది ప్రజల చేతుల్లోనే ఉందని ఈ థీమ్ సూచిస్తుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =